పెద్దేముల్ గ్రంథాలయంలో పాఠకులకు విశేష సేవలు
VKB: పెద్దేముల్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో పాఠకులకు విశేషమైన సేవలు అందుతున్నాయి. గతంలో గ్రంథ పాలకుడిగా పని చేసిన కృష్ణయ్య గ్రంథాలయాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. దీంతో లైబ్రరీ పాఠకులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటీవలే కృష్ణయ్య ఉద్యోగ విరమణ చెందడంతో గ్రంథాలయాన్ని రఘు నిర్వహిస్తున్నారు. ఇక్కడి వాతావరణం పాఠకులను ఆకట్టుకుంటోంది.