'పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి'
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలో ఏవో ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడిఏ వెంకటరాముడు హాజరయ్యారు. ముందుగా రైతులు పండించిన పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు.