వినతులు స్వీకరించిన జనసేన ఇన్‌ఛార్జ్
AKP: ప్రజా సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రాంకీ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చినట్లు పేర్కొంటూ.. వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.