VIDEO: అమ్మాపురం శివాలయానికి పోటెత్తిన భక్తులు
MHBD: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అడ్లూరి సోమేశ్వర శర్మ, వెంకటనారాయణ శర్మ ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో విశేష అభిషేకాలు, అర్చనాలు నిర్వహించారు.