మాదక ద్రవ్యాల నియంత్రంణపై ఎమ్మెల్యే సందేశం

చిత్తూరు: గుడిపాల మండలం రాసనపల్లిలో అక్రమ నాటుసారా, కర్ణాటక మద్యం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగిందని, ఇకపై ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. బుధవారం లక్ష్మీ నగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్లో జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా అహింస, యువత మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణపై నియోజకవర్గ పరిధిలో గల సీఐలతో కలిసి సమావేశం నిర్వహించారు.