పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు
KMM: తల్లాడ పీహెచ్సీ ఆధ్వర్యంలో రామానుజవరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తమ పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలని పీహెచ్సీ సిబ్బంది సూచించారు. టీకాల ఆవశ్యకతపై తల్లిదండ్రులకు శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు త్రివేణి, సుజాత, ఆశా కార్యకర్త సరస్వతి పాల్గొన్నారు.