గ్యాస్ కోసం ఎండలో ఎదురుచూపులు

గ్యాస్ కోసం ఎండలో ఎదురుచూపులు

NLG: చందంపేట మండల కేంద్రంలోని ఎచ్‌పి గ్యాస్ గోదాం వద్ద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకు చందంపేట, నేరేడుగొమ్ము మండలాల పరిధిలో గ్యాస్ ఆటోల ద్వారా గ్రామాలకే నేరుగా సరఫరా జరిగేది. అయితే ప్రస్తుతం ఆ విధానం నిలిచిపోవడంతో ప్రజలు సిలిండర్ల కోసం ఎండలో అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా వారి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.