నివాళులర్పించిన టీపీసీసీ కార్యదర్శి

NLG: నకిరేకల్ మండలం టేకులగూడెంలో నిరుపేద కుటుంబానికి చెందిన పన్నాల శివారెడ్డి (25) మృతి చెందాడు. మృతదేహానికి శనివారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దహన సంస్కారాల కోసం తక్షణ సహాయంగా రూ. 5 వేలు అందించారు. గ్రామ కాంగ్రెస్ నేతలు ఆయనతో ఉన్నారు.