అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

E.G: నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే పోలీసులు వెంటనే 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.