పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలి: సీఐ

ప్రకాశం: పామూరులోని స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ భీమా నాయక్ బుధవారం వెలిగండ్ల, చంద్రశేఖరపురం, పామూరు ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం చేయవద్దని, మహిళలు, చిన్నారులు, వృద్ధులకు సంబంధించిన కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.