గ్రూప్-1 వాల్యుయేషన్‌పై ఎంపీ మల్లు రవి వ్యాఖ్యలు

NGKL: గ్రూప్ -1 వాల్యుయేషన్ పై పొరపాట్లు జరిగాయని కొందరు చెబుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. వాల్యుయేషన్ ఏమన్నా సీఎం రేవంత్ రెడ్డి చేస్తాడా? అని ప్రశ్నించారు. పరీక్షా ప్రక్రియ పూర్తిగా సంబంధిత అధికారుల ఆధీనంలోనే జరుగుతుందని, దానిపై అనవసర ఆరోపణలు చేయడం తగదని స్పష్టం చేశారు.