అమరేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
PLD: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదివారం కుటుంబ సమేతంగా పంచరామక్షేత్రాలలో ఒకటైన అమరావతి సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు దంపతులకు వేద పండితులుచే ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.