నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం

నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు ఆహ్వానం

MLG: పి.ఎం శ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 వ తరగతి 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. సెప్టెంబర్ 23లోగా ఎన్విఎస్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపిక పరీక్ష 2026 ఫిబ్రవరి 7న నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఉమ్మడి వరంగల్ జిల్లావాసులై ఉండాలన్నారు.