వీధి కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి
VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని పాతబొబ్బిలిలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో శుక్రవారం ముగ్గురు చిన్నారులపై దాడి చేసి గాయపరచడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పాతబొబ్బిలికి చెందిన హాసిని, తెంటు రాంబాబు, అప్పికొండ సతీష్ పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. వీరిని కుటుంబ సభ్యులు బొబ్బిలి సి.హెచ్.సిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.