VIDEO: దేవరాంపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈసీ నది

RR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ నది పొంగిపొర్లుతుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరాంపల్లి గ్రామం వద్ద ఈసీ నది పొంగి పొర్లుతుండడంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాలన్నీ నీటమునిగాయి. ఈసీ ఉద్ధృతికి ఎటుచూసినా నీరే కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా ఈసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.