VIDEO: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్

BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వార్డులను పరిశీలించి, వైద్య సేవలను సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.