ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలి: కలెక్టర్

ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలి: కలెక్టర్

RR: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. సోమవారం నుంచి ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.