మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర

ASR: మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ అధికారి టీ. జగత్‌రాయ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాల్లో కాపీరైట్ చట్టాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ, నిబంధనలు అమలు చేయాలని సూచించారు. డిగ్రీ కాలేజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.