జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో సిబ్బంది కొరత

జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో సిబ్బంది కొరత

WGL: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో, ముఖ్యంగా భద్రకాళి దేవస్థానం వద్ద సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 56 మంది EOలు అవసరముండగా కేవలం 14 మందితోనే పనులు సాగుతున్నాయి. సూపరింటెండెంట్లు, అసిస్టెంట్లు లేకపోవడంతో నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కరే పలు బాధ్యతలు నిర్వహించడంతో వ్యవస్థ దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.