ఉదయం 6 గంటలకే ఉపాధి పనులు
NGKL: పెద్దకొత్తపల్లి మండలం చేన్నపరావుపల్లిలో ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి గోపాల్ తనిఖీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీల సౌకర్యార్థం ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించాలని సూచించారు. మస్టర్ ఫొటోలను సకాలంలో అప్‌లోడ్ చేయాలని, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పనుల్లో పారదర్శకత పాటించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఆదేశించారు.