'తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష'

'తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష'

NLG: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. మండలంలోని చింతపల్లి గ్రామం మాజీ సర్పంచ్ బానావత్ లలితా సక్రు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు బాణావత్ కృష్ణా నాయక్‌తో పాటుగా 200 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.