కేసీఆర్‌ని చూడ్డానికి ప్రజలు భారీగా వస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

HYD: వరంగల్‌లో ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నానన్నారు. చాలా రోజులు అనంతరం కేసీఆర్ బయటికి వస్తుండడంతో.. కేసీఆర్‌ని చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని అన్నారు. సభకు కూడా జనం బాగా వస్తారని అనుకుంటున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు.