'కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది'
వరంగల్‌లోని BRS పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్,మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్కదానినీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.