116వ రోజుకు చేరుకున్న దీక్ష
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న నిరవధిక దీక్ష ఇవాళ 116వ రోజుకు చేరుకుంది. న్యాయవాదులు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాగా ఏర్పడితే పరిపాలన ప్రజలకు చేరువై మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని తెలిపారు.