'డీఎంకే కూటమిలోని పార్టీలన్నీ వారికి బానిసలే'
గతంలో అన్నాడీఎంకే పాలన స్వర్ణయుగంలా కొనసాగిందని మాజీ సీఎం పళనిసామి చెప్పారు. కానీ డీఎంకే ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. శాంతిభద్రలు దారుణంగా మారాయని మండిపడ్డారు. రైతులు పలు రకాలుగా మోసపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న పార్టీలన్నీ స్టాలిన్ కుటుంబానికి బానిసలేనని ఎద్దేవా చేశారు.