'ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు చర్యలు'
MNCL: ఈనెల 14న జరగనున్న 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామాగ్రిని కేటాయించిన ప్రకారం పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం వేమనపల్లిలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా జరిగేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.