సీతారామ ప్రాజెక్టు కాలువలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

సీతారామ ప్రాజెక్టు కాలువలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

BDK: బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువలలో బుధవారం ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులలో ఒకరు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.