గ్రేటర్ భూగర్భ జలాల్లో కాలుష్యం

గ్రేటర్ భూగర్భ జలాల్లో కాలుష్యం

HYD: గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లు కేంద్ర భూగర్భ జలశాఖ వార్షిక నివేదిక-2025లో పేర్కొంది. ఈ జలాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్లు అధికంగా ఉన్నాయని, కొన్ని చోట్ల యురేనియం, ఐరన్, ఆర్సినిక్ వంటివి కూడా ఉన్నట్లు పరీక్షల ద్వారా గుర్తించారు. ఈ కాలుష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది.