గండికోటలో తగ్గిన నీళ్లు 10 గ్రామాలకు రహదారి

KDP: గండికోట జలాశయం వెనుక జలాల నీళ్లు తగ్గుదల కావడంతో కొండాపురం మండలంలోని సంకేపల్లె నుంచి బొందలదిన్నె మధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన రహదారి బయల్పడింది. గత నాలుగేళ్లుగా ఈ రహదారి నీళ్లలో మునిగి ఉండేది. దాంతో కొండాపురం, తాడపత్రి వెళ్లాలంటే రహదారి లేక పలు అవస్తలు పడేవారు. ప్రస్తుతం మండలంలోని కోడూరు, సిరిగేపల్లె, చామలూరు, మరో ఏడు గ్రామాల ప్రజలు సంతోషపడ్డారు.