ఆయన అంటే అవే చెప్పులు.. అదే ఆటో: బ్రహ్మానందం

R. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'యూనివర్సిటీ పేపర్ లీక్'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం.. నారాయణమూర్తితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు. ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారని చెప్పారు. అవే చెప్పులు, అదే ప్యాంటుషర్ట్.. అదే ఆటో అని తెలిపారు. నారాయణమూర్తి నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారని, ఈ సినిమా కూడా ప్రజల కోసమే తీశారని పేర్కొన్నారు.