నేడు లంబసింగిలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

ASR: రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకరరావు సోమవారం చింతపల్లి మండలం లంబసింగిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన లంబసింగి చేరుకుంటారు. అక్కడ గిరిజన రైతులు ఏర్పాటు చేసిన సంప్రదాయ విత్తన వైవిధ్యం, దేశీయ విజ్ఞాన వ్యవస్థల ప్రాంతీయ ప్రదర్శనలో పాల్గొంటారు. అనంతరం తాజంగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులు పరిశీలిస్తారు.