ఏప్రిల్ ఆఖరు వరకు 'ఎర్లీబర్డ్ స్కీమ్'

ఏప్రిల్ ఆఖరు వరకు 'ఎర్లీబర్డ్ స్కీమ్'

HYD: తెలంగాణలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆస్తి పన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ(ఎర్లీబర్డ్ స్కీమ్) అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 30లోపు వార్షిక ఆస్తి పన్నును చెల్లించే యజమానులు ఈ రాయితీని పొందవచ్చు. దీనిని మైక్యూర్ మొబైల్ యాప్, GHMC, CMC, MMC వెబ్‌సైట్లలో పౌరసేవా కేంద్రాల ద్వారా పన్ను చెల్లించొచ్చని అధికారులు తెలిపారు.