హైదరాబాద్ హౌస్‌లో మోదీ, పుతిన్ భేటీ

హైదరాబాద్ హౌస్‌లో మోదీ, పుతిన్ భేటీ

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మ.12 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో ఇరు దేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. వాణిజ్యం, రక్షణ రంగం సహా పలు అంశాలపై రెండు దేశాల అధినేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. భేటీ అనంతరం మోదీ, పుతిన్‌ సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారు.