డక్కిలి ZPTC కలిమిలి రాజేశ్వరి మృతి

TPT: డక్కిలి ZPTC కలిమిలి రాజేశ్వరి బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొన్ని రోజులుగా రాజేశ్వరి అనారోగ్యంతో బాధపడుతుంది. బెంగళూరులో ఉంటూ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని బెంగళూరు నుంచి వెంకటగిరిలోని వారి స్వగృహానికి తీసుకుస్తున్నారు. శుక్రవారం ఆమె స్వగ్రామం చాపలపల్లికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారని బంధుమిత్రులు చెబుతున్నారు.