VIDEO: కాణిపాకంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆలయ క్యూలైన్లు నిండి బయటి వరకు భక్తులు వేచి ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో పెంచల కిశోర్ స్పష్టం చేశారు.