విద్యుత్ తీగ తగిలి గడ్డివాముకు అగ్ని ప్రమాదం
BHNG: వలిగొండ మండలం పులిగిల్ల గ్రామం నుంచి రుస్తాపురం గ్రామానికి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పులిగిల్ల నుంచి గడ్డి తరలిస్తుండగా విద్యుత్ తీగకు గడ్డి తగలడంతో మంటలు చెలరేగాయి. ట్రాక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి, ట్రాక్టర్‌ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు తగలడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.