అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే
KMR: డా. బీ.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం బాన్సువాడలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహా స్థానిక నాయకులు పాల్గొన్నారు.