లక్నో వంటలకు యునెస్కో గుర్తింపు

లక్నో వంటలకు యునెస్కో గుర్తింపు

వంటకాలకు ప్రసిద్ధి చెందిన లక్నో అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌ (CNN) జాబితాలో చోటు దక్కించుకుంది. CNNలోని గ్యాస్ట్రోనమీ విభాగంలో ఈ ఏడాది కొత్తగా 58 నగరాలకు ప్రవేశం కల్పించగా వాటిలో భారత్‌కు చెందిన లక్నో ఉంది. రుచికరమైన వంటల విభాగంలో లక్నో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.