సబ్‌ జైలు సందర్శించిన జడ్జి

సబ్‌ జైలు సందర్శించిన జడ్జి

W.G: తణుకు సబ్‌ జైలును నాలుగో అదనపు జిల్లా న్యాయమూర్తి డి.సత్యవతి శనివారం సందర్శించారు. రిమాండ్‌ ముద్దాయిలకు అందుతున్న ఆహార వసతి, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని నియమించుకునే స్తోమత లేకపోతే వారికి తణుకు మండల న్యాయ సేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సేవలు అందిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ న్యాయవాదిని కలిగి ఉండాలన్నారు.