VIDEO: ఉప్పొంగిన చాపరాయి గెడ్డ

VIDEO: ఉప్పొంగిన చాపరాయి గెడ్డ

ASR: డుంబ్రిగుడ మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలవిహారి వద్ద గెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. దీంతో అధికార యంత్రాంగం సందర్శకుల అనుమతిని నిలిపివేసింది. తిలకించేందుకు వచ్చిన పర్యాటకులకు ఈ విషయం తెలియకపోవడంతో నిరాశకు గురయ్యారు. ముఖద్వారం నుంచి ప్రకృతి అందాలను తిలకించి వెనుతిరుగుతున్నారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాతే లోపల ప్రవేశం ఉంటుందని సిబ్బంది తెలిపారు.