చైనీస్ మాంజా విక్రయించిన వారిపై కఠిన చర్యలు: ఎస్సై
KNR: వీణవంక ప్రజల ప్రాణాలకు, ముప్పుగా మారిన చైనీస్ మాంజాపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. చైనీస్ మంజా విక్రయించిన దుకాణాల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అట్టి వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని ఎస్సై అవుల తిరుపతి హెచ్చరించారు. ఎవరైనా విక్రయాలు చేసినట్టు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ నంబర్ 9490616555 ను సంప్రదించాలన్నారు.