ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన

ATP: ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ సెకెండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేశ్ కిషోర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి చౌదరి, ఆసుపత్రి సిబ్బంది స్వాగతం పలికారు. ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసి మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో పరిశీలించినట్లు తెలిపారు. మంత్రి పయ్యావుల కేశవ్ సూచనల మేరకు ఆసుపత్రిని తనిఖీ చేశారు.