శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే
MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్‌లో నిర్వహించిన 396వ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని ఆయన పేర్కొన్నారు.