రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొర్ల రాజబాబు (58) అనే వృద్ధుడు మృతి చెందాడు. రహదారిపై వెళ్తున్న వృద్ధుడిని ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.