శంషాబాద్‌లో మాక్ డ్రిల్

HYD: శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషాబాద్ బస్టాండ్ సమీపంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అవగాహన కల్పిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, పలువురు పోలీసులు పాల్గొన్నారు.