VIDEO: సీపీలు మారిన ఠాణా గతి మారడం లేదు..!
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీలు మారుతున్నా హనుమకొండ జిల్లా ఐనవోలు పోలీస్ స్టేషన్ పరిస్థితి మారలేదు. గత ఏడేళ్లుగా మల్లన్న సత్రంలోనే ఠాణా కొనసాగుతోంది. ప్రభుత్వం మారినా నూతన భవనం లేక పోలీసులు నరకయాతన అనుభవిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎక్కడంటే మల్లన్న సత్రం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి తమకు మనోవేదన కలిగిస్తోందని వారు వాపోతున్నారు.