VIDEO: స్వామి వారికి వైభవంగా పూలంగి సేవ

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి స్వామివారికి పూలంగి సేవ నిర్వహించారు. అనంతరం కళ్యాణ వేదికలో ఉంజల్ సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రాకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, పూలంగి సేవ ఉభయ దారులు పాల్గొన్నారు.