నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

KMM: ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు సబ్‌స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ళ, తెల్దారుపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో ఉ.10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు.