విచారణకు హాజరైన శ్యామల
AP: వైసీపీ నాయకురాలు శ్యామల పోలీసు విచారణకు హాజరయ్యారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అసత్య ప్రచారం చేశారని శ్యామలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణలో పాల్గొన్నారు. కాగా, కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం 'బెల్టు షాపులు, కల్తీ మద్యం' కారణంగా జరిగిందని తప్పుడు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.