హమాస్ వీడియోను రిలీజ్ చేసిన అమెరికా
గాజా ప్రజల కోసం పంపుతున్న మానవతా సాయాన్ని హమాస్ అడ్డుకుంటుందని అమెరికా ఆరోపించింది. దక్షిణ గాజా స్ట్రిప్‌లో సహాయ ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేసి.. దాన్ని దొగలించారని తెలిపింది. ఇందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను షేర్ చేసింది. ఆకలితో విలవిలలాడుతోన్న గాజా ప్రజల మానవతా సాయాన్ని అడ్డుకుని వారి ప్రాణాలతో హమాస్ చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.